'వర్షం' సినిమాపై త్రిష కామెంట్స్

  • 40 రోజులు నీటిలో తడుస్తూ షూటింగ్ లో పాల్గొన్నాన్న త్రిష
  • వర్షంలో షూటింగ్ అంటేనే  భయం వేసిందని వ్యాఖ్య
  • మూడు సినిమాల్లో కలిసి నటించిన ప్రభాస్, త్రిష
ప్రభాస్, త్రిష కాంబినేషన్లో వచ్చిన 'వర్షం' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రిష ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సినిమా కోసం తాను 40 రోజుల పాటు నీటిలో తడుస్తూ షూటింగ్ లో పాల్గొన్నానని తెలిపింది. 

షూటింగ్ ప్రారంభానికి ముందే... నీటిలో ఎక్కువగా తడుస్తూ నటించాల్సి ఉంటుందని డైరెక్టర్ శోభన్ చెప్పారని త్రిష చెప్పింది. సన్నివేశాలే కాకుండా పాటలను కూడా వర్షంలో షూట్ చేశారని తెలిపింది. 

ఈ సినిమా దెబ్బకు వర్షంలో షూటింగ్ అంటేనే భయం వేసిందని త్రిష చెప్పింది. ఆ తర్వాత సినిమాల్లో వర్షం సీన్లు ఉన్నాయా? అని భయపడేదాన్నని తెలిపింది. మరోవైపు, ఈ సినిమాతో ప్రభాస్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోగా... త్రిష కెరీర్ ఒక రేంజ్ కి వెళ్లిపోయింది. ఆ తర్వాత ప్రభాస్, త్రిషలు 'పౌర్ణమి', 'బుజ్జిగాడు' సినిమాల్లో నటించారు.


More Telugu News