సీఎం రేవంత్ ను కలిసిన తలసాని.. కారణం ఇదే!
--
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నిత్యం విమర్శలు గుప్పిస్తోంది.. బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా జనాలతో కలిసి ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఉదయం బంజారాహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి తలసాని భేటీ అయ్యారు. తన సోదరుడి కుమార్తె వివాహానికి రావాలంటూ రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. పెళ్లి పత్రిక అందించి, చిరునవ్వులతో చేతులు కలిపారు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.