తెలంగాణ సీఎంకు 'స్పెషల్ థ్యాంక్స్' చెప్పిన అల్లు అర్జున్
- అల్లు అర్జున్, రష్మిక జంటగా పుష్ప-2 ది రూల్
- డిసెంబరు 5న వరల్డ్ వైడ్ రిలీజ్
- టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతించిన తెలుగు రాష్ట్రాలు
పుష్ప-2 చిత్రం టికెట్ల ధర పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ సినిమా హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు.
"తాజా జీవో జారీ చేయడం ద్వారా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించి మా సినిమాకు మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆలోచనాత్మకంగా తీసుకున్న మీ నిర్ణయం తెలుగు సినిమా ఉన్నతికి తోడ్పడుతుంది. తెలుగు సినిమా రంగం అభివృద్ధికి అచంచలమైన మద్దతును కొనసాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, చిత్ర పరిశ్రమకు ఎనలేని సహకారం అందిస్తున్న సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా, సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పుష్ప-2 ది రూల్ చిత్రం డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిచ్చాయి.