శోభన్ బాబుగారి అబ్బాయి నన్ను చూసి ఏమన్నారంటే: జూనియర్ శోభన్ బాబు
- అచ్చు శోభన్ బాబులా కనిపించే వెంకటేశ్వర్లు
- తనకి శోభన్ బాబు గారు అంటే ఇష్టమని వెల్లడి
- చిన్నప్పటి నుంచి ఆయనను అనుకరించేవాడినని వివరణ
- కరుణశేషు తనని ఎంతో గౌరవంగా చూశాడని వ్యాఖ్య
స్టార్ హీరోలను పోలినవారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అదే స్టైల్ ను మెయింటేన్ చేస్తూ మరింత ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలాంటివారిలో తాడేపల్లిగూడానికి చెందిన వెంకటేశ్వర్లు ఒకరు. అక్కడివారు ఆయనను జూనియర్ శోభన్ బాబు అంటూ ఉంటారు. అచ్చు శోభన్ బాబులా కనిపిస్తూ .. ఆయన మాదిరి స్టెప్పులతో అలరించే వెంకటేశ్వర్లు, ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"నేను చిన్నప్పటి నుంచి శోభన్ బాబుగారి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. కూర్చోవడం .. నడవడం దగ్గర నుంచి ఆయన స్టైల్ ను నేను అనుకరించేవాడిని. 'బలరామకృష్ణులు' షూటింగు సమయంలో నేను శోభన్ బాబుగారిని కలిశాను. అప్పుడు ఆయన తన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడటం నా జీవితంలో మరిచిపోలేని రోజు. ఆయన స్టైల్ ను అనుకరిస్తూ ఉంటానని చెబితే, ''అయితే 'రింగ్' ఏదోయ్ ..'' అన్నారు.
"శోభన్ బాబుగారి కుమారుడు కరుణశేషు గారికి నా గురించి తెలిసి నన్ను వారి ఇంటికి పిలిపించారు. నేను శోభన్ బాబుగారి మాదిరిగానే మేకప్ చేసుకుని కరుణశేషు గారి ముందుకు వెళ్లాను. నన్ను ఆయన పై నుంచి క్రిందికి అలానే చూస్తూ .. ఆప్యాయంగా హత్తుకున్నారు. 'మా నాన్నగారిలానే ఉన్నారు' అని అక్కడి వాళ్లతో చెప్పారు. ఆ తరువాత వారి ఇంట్లో జరిగిన ఫంక్షన్ కి కూడా నన్ను ఆహ్వానించారు. వారి బంధువులంతా నన్ను ఎంతో గౌరవంగా చూసుకున్నారు" అని చెప్పారు.