ఆ నీటిలో మాకు అధిక వాటాను ఇవ్వాలి: కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి
- గోదావరి-కావేరీ అనుసంధానంతో తరలించే 148 టీఎంసీల్లో సగం ఇవ్వాలన్న తెలంగాణ
- 42 టీఎంసీలకు మించి ఇవ్వలేమన్న కేంద్ర జలశక్తి శాఖ
- నీటి పంపిణీకి సంబంధించి కుదరని ఏకాభిప్రాయం
గోదావరి-కావేరీ నదుల అనుసంధానంతో తెలంగాణ అధిక భూభాగాన్ని కోల్పోతోందని, కాబట్టి తమకు నీటి వాటాలో ఎక్కువ ఇవ్వాలని తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. జాతీయ జల అభివృద్ధి సంస్థ 74వ పాలకమండలి సమావేశం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన ఈరోజు జరిగింది.
ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఇంజినీర్లు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ నుంచి చేపడుతున్నందున అధిక వాటా ఇవ్వాలన్నారు. గోదావరి-కావేరీ అనుసంధానంతో తరలించే 148 టీఎంసీల్లో సగం వాటా ఇవ్వాలన్నారు.
అయితే ఇలా మళ్లించే నీటిలో 42 టీఎంసీలకు మించి నీటిని తెలంగాణకు ఇవ్వలేమని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. నీటి వాటా పంపిణీకి సంబంధించి రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ నెలాఖరున మరోసారి సమావేశం నిర్వహించాలని కేంద్ర జలవరుల శాఖ భావిస్తోంది.