17 ఏళ్ల తర్వాత ఆడిపాడనున్న ప్రభాస్, నయనతార?

  • ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ది రాజా సాబ్'
  • ఈ సినిమాలో ప్రత్యేక పాటలో నయనతార ఆడిపాడనున్నట్టు సమాచారం
  • ప్రభాస్, నయన్ కాంబినేషన్లో 17 ఏళ్ల క్రితం వచ్చిన 'యోగి'
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో 'ది రాజా సాబ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లు ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ తో కలిసి నయనతార ఒక ప్రత్యేక పాటలో ఆడిపాడనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపారని...ఆమె ఓకే చెప్పారని తెలిసింది. ఈ నెలాఖరులో పాటను చిత్రీకరించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరోవైపు, 2007లో వచ్చిన 'యోగి' సినిమాలో ప్రభాస్, నయనతార జంటగా నటించారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. అంతా కుదిరితే వీరిద్దరూ 17 ఏళ్ల తర్వాత స్క్రీన్ ను షేర్ చేసుకోవడం జరుగుతుంది.


More Telugu News