ఎల్లుండి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం
- ఈ నెల 8న మధ్యాహ్నం 1 గంటలకు సమావేశం
- ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో భేటీ కానున్న కేసీఆర్
- సమావేశం ఉంటుందని వెల్లడించిన కేటీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎల్లుండి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 1 గంటలకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు.
ఏం విగ్రహమంటూ కేటీఆర్ ఆగ్రహం
సచివాలయంలో ఏర్పాటు చేస్తోంది తెలంగాణ తల్లి విగ్రహమా? లేక కాంగ్రెస్ తల్లి విగ్రహమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని మండిపడ్డారు. నాలుగేళ్ల తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుందన్నారు. అలాగే రాజీవ్ గాంధీ విగ్రహం ఎక్కడ ఉండాలో అక్కడికే పంపిస్తామన్నారు.