15 ఏళ్ల విద్యార్థికి నగ్న వీడియోలు, ఫొటోలు పంపిన 33 ఏళ్ల టీచర్‌!

  • యూకేలోని ఓ స్కూల్‌లో ఘటన
  • తానంటే కుర్రాళ్లు పడి చస్తారంటూ మెసేజ్‌లు
  • తన ప్రైవేటు ఫొటోలు, వీడియోలు పంపుతూ.. బాలుడిని కూడా పంపాలని కోరిన వైనం
  • శారీరక సంబంధం పెట్టుకోవాలని ఉందని కోరిక వెల్లడించిన టీచర్
  • ప్రస్తుతం కోర్టు విచారణలో కేసు
15 ఏళ్ల బాలుడికి తన నగ్న వీడియోలు, ఫొటోలు పంపిన యూకే టీచర్ (33) ప్రస్తుతం కటకటాలు లెక్కపెట్టుకుంటోంది. ఓ స్కూల్‌లో సప్లై టీచర్‌ (తాత్కాలిక ప్రాతిపదికన)గా పనిచేస్తున్న అరాయో టీనేజర్‌కు మొదట మామూలుగా టెక్స్ట్ మెసేజ్‌లు పంపేది. ఆ తర్వాత వాటి డోసు పెంచింది. తానంటే కుర్రాళ్లు పడి చస్తారని అంటూ అసభ్య మెసేజ్‌లు పెట్టేది. ఆ తర్వాత లోదుస్తులతో ఉన్న ఫొటోలు పంపుతూ కుర్రాడిని కూడా ప్రైవేటు ఫొటోలు పంపాలని కోరేది. అంతేకాదు, శారీరకంగా కలవాలని అనుకుంటున్నట్టు కూడా చెప్పేది. 

ఆమె ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లతో విసుగు చెందిన బాలుడు ఇకపై ఇలాంటివి పంపొద్దని, వాటికి ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరాడు. అయినప్పటికీ ఆమె అదేమీ పట్టించుకోకుండా వాటిని పంపుతూనే ఉంది. బాలుడు ఈ విషయాన్ని మరో వ్యక్తితో చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత విషయం పోలీసులకు చేరడంతో కేసు నమోదైంది. పోలీసుల విచారణలో ఆమె నిజాన్ని అంగీకరించింది. బాలుడి వయసు 16 ఏళ్లు ఉంటుందని భావించానని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెపై బాలుడితో లైంగిక సంభాషణ, అతడిని శృంగార కార్యకలాపాలకు పురికొల్పేలా ప్రయత్నించడం వంటి రెండు అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది.


More Telugu News