మోదీ, ఖర్గేల కరచాలనం, నవ్వులు.. వీడియో ఇదిగో!

--
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నిత్యం విమర్శించే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అదే ప్రధానితో నవ్వుతూ మాట్లాడటం అరుదైన విషయం. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంట్ లో మహాపరిణివరణ్ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ కు ఎంపీలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ వద్దకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వచ్చారు. మోదీతో కరచాలనం చేస్తూ మాట్లాడారు. ఈ క్రమంలోనే మోదీ, ఖర్గేలు ఇద్దరూ నవ్వడం వీడియోలో కనిపిస్తోంది. మోదీ, ఖర్గేల పక్కనే ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖడ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. అనంతరం వారంతా కలిసి ఫొటోలకు పోజిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


More Telugu News