గాయపడిందేమో అనుకుని ఫుడ్‌ పెడితే.. ఈ పక్షుల యాక్షన్ మామూలుగా లేదు!

  • గాయపడిన ఓ కాకికి ఆహారం పెట్టిన యువకుడు
  • అది చూసి తామూ గాయపడి పడిపోయినట్టుగా మరికొన్ని పక్షుల నాటకం
  • సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారిన వీడియో
అక్కడో ఓ కాకి కింద పడిపోయి ఉంది... పాపం ఏదైనా దెబ్బతగిలి పడిపోయిందేమోనని ఒకతను దానికి కాసిన్ని గింజలు వేశాడు... అది ఆ గింజలు తినేసింది. మిగతా కాకులు ఇది చూశాయి. వాటికి కూడా తిండి దొరుకుతుందని ఆశపడ్డాయి. మొదటి పక్షి పడిపోయిన చోటికి వచ్చి... అవి కూడా పడిపోయినట్టుగా పడుకుని నాటకం ఆడటం మొదలుపెట్టాయి. అలా ఓ పక్షి పడుకుని ఉంటే... మరో పక్షి వచ్చి అలాగే నాటకం మొదలుపెట్టింది. ఇది చూసి మొదటి పక్షి లేచి దాన్ని తరిమేసింది... మళ్లీ ఎప్పటిలా పడిపోయినట్టుగా నాటకం మొదలుపెట్టింది.

  • సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ఈ పక్షుల నాటకం వీడియో వైరల్‌ గా మారింది. ఒక్క రోజులోనే ఏకంగా 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ నమోదయ్యాయి. వేలకొద్దీ లైకులు, షేర్లు వచ్చాయి.
  • "పక్షుల్లో కాకులు చాలా తెలివైనవి. అవి ఇలాంటివెన్నో చేస్తుంటాయి. మనమే గమనించం..." అంటూ కొందరు కామెంట్‌ చేస్తుంటే... "వామ్మో ఇవేం తెలివి తేటలు. వాటి యాక్టింగ్‌ కు ఆస్కార్‌ అవార్డు’ ఇవ్వాల్సిందే" అని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.


More Telugu News