మా కుటుంబ స‌మ‌స్య‌ల‌కు త్వ‌ర‌లోనే ప‌రిష్కారం.. ఫ్యామిలీ గొడ‌వ‌ను పెద్ద‌గా చిత్రీక‌రించ‌డం త‌గ‌దు: మంచు విష్ణు

  • తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మంచు ఫ్యామిలీ వివాదం
  • తండ్రీకొడుకులు మోహ‌న్‌బాబు, మ‌నోజ్‌పై కేసులు న‌మోదు
  • దుబాయి నుంచి రాగానే ఫ్యామిలీ గొడ‌వ‌పై స్పందించిన మంచు విష్ణు 
  • అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు స‌హ‌జ‌మ‌న్న‌ మోహ‌న్‌బాబు
మంచు ఫ్యామిలీ వివాదం ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. తండ్రీకొడుకులు మోహ‌న్‌బాబు, మ‌నోజ్ ఒక‌రిపై ఒక‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేసుకున్నారు. దాంతో మంచు మ‌నోజ్‌, మంచు మోహ‌న్‌బాబు నుంచి ఫిర్యాదులు స్వీక‌రించిన ప‌హాడిష‌రీఫ్ పోలీసులు మంగ‌ళ‌వారం రెండు కేసులు న‌మోదు చేశారు.   

మోహ‌న్‌బాబు ఫిర్యాదుతో మంచు మ‌నోజ్‌, అత‌ని భార్య భూమా మౌనికపై  329, 351(బీ.ఎన్.ఎస్ ) సెక్ష‌న్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే మ‌నోజ్ ఫిర్యాదు మేర‌కు మోహ‌న్‌బాబు అనుచ‌రుల‌పై 329, 351, 115(బీ.ఎన్.ఎస్) సెక్ష‌న్ల కింద కేసు నమోదు చేశారు. 

ఇదిలాఉంటే.. ఈరోజు ఉద‌యం మంచు విష్ణు  దుబాయి నుంచి హైద‌రాబాద్ చేరుకున్నారు. జ‌ల్‌ప‌ల్లిలోని ఇంటికి వెళ్లే మార్గ‌మ‌ధ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌మ కుటుంబంలో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు త‌లెత్తాయ‌ని, త్వ‌ర‌లోనే అన్నీ ప‌రిష్కారం అవుతాయ‌ని విష్ణు అన్నారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్ద‌గా చిత్రీక‌రించ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న తెలిపారు.  

అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు స‌హ‌జం: మోహ‌న్‌బాబు
అంత‌కుముందు త‌మ కుటుంబంలో చెల‌రేగిన వివాదంపై మోహ‌న్‌బాబు మాట్లాడుతూ.. ఏ ఇంట్లోనైనా అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు స‌హ‌జమ‌ని అన్నారు. ఇది త‌మ ఇంట్లో జ‌రుగుతున్న చిన్న త‌గాదా అని పేర్కొన్నారు. ఇళ్ల‌ల్లో గొడ‌వ‌లు జ‌రిగితే అంత‌ర్గ‌తంగా ప‌రిష్క‌రించుకుంటార‌ని, గ‌తంలో తాను ఎన్నో కుటుంబాల గొడ‌వ‌ల‌ను ప‌రిష్క‌రించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  


More Telugu News