పుష్ప-2 ప్రదర్శిస్తున్న థియేటర్లో ప్రేక్షకుడి అనుమానాస్పద మృతి
- అనంతపురం జిల్లాలో ఘటన
- రాయదుర్గంలోని ఓ థియేటర్ లో పుష్ప-2 ప్రదర్శన
- సినిమా ముగిసినా సీట్లోనే చలనం లేకుండా ఉన్న యువకుడు
- తొక్కిసలాట వల్లే చనిపోయాడంటున్న కుటుంబ సభ్యులు
అనంతపురం జిల్లాలో పుష్ప-2 చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లో ఓ ప్రేక్షకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. మృతిచెందిన ప్రేక్షకుడ్ని ముద్దానప్ప అనే యువకుడిగా గుర్తించారు. రాయదుర్గంలో పుష్ప-2 సినిమా చూసేందుకు ముద్దానప్ప థియేటర్ కు వెళ్లాడు. అయితే, షో పూర్తయ్యాక కూడా ముద్దానప్ప చలనం లేకుండా సీట్లోనే ఉండిపోవడంతో, ఇతర ప్రేక్షకులు యాజమాన్యానికి సమాచారం అందించారు.
ముద్దానప్ప కుటుంబ సభ్యులు థియేటర్ వద్దకు చేరుకుని, మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. తొక్కిసలాట వల్లే ముద్దానప్ప మరణించాడంటూ, వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.