'ఆహా' తెరపైకి తమిళ హారర్ థ్రిల్లర్!

  • సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రగా '7G'
  • జులైలో థియేటర్స్ కి వచ్చిన సినిమా
  • దెయ్యం చుట్టూ తిరిగే కథ  
  • ఈ నెల 12 నుంచి మొదలుకానున్న స్ట్రీమింగ్

చాలా కాలం క్రితం తెలుగులో సోనియా అగర్వాల్  చేసిన '7G బృందావన కాలనీ' సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే సోనియా అగర్వాల్ ప్రధానమైన పాత్రను పోషించిన '7 G' సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతోంది. ఈ హారర్ థ్రిల్లర్ సినిమా, జులై 5వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 12 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

సిద్ధార్థ్ విపిన్ .. స్మృతి వెంకట్ .. సోనియా అగర్వాల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి హరూన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి రచయిత - నిర్మాత కూడా ఆయనే. హీరో సిద్ధార్థ్ విపిన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. స్నేహ గుప్తా .. రోషన్ బషర్ .. సుబ్రమణ్య శివ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

కథ విషయానికి వస్తే, రాజీవ్ (సిద్ధార్థ్ విపిన్) వర్ష ( స్మృతి వెంకట్) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వారికి ఒక సంతానం కలుగుతుంది. ఒక అపార్టుమెంటులో 7వ అంతస్తులోని ఫ్లాట్ తీసుకుంటారు. రాత్రివేళలో చిత్రమైన శబ్దాలు వస్తుండటంతో, తమతో పాటు ఒక దెయ్యం కూడా ఉంటుందనే విషయం వారికి అర్థమవుతుంది. అది ఎవరి ప్రేతాత్మ? ఎవరిపై పగతో ఉంది? అందుకు కారణమేమిటి? అనేది కథ. 



More Telugu News