మోహన్ బాబు అయితేనేం, ఇంకెవరైతేనేం... మీడియాపై దాడి చేయడమేంటి?: కేఏ పాల్

  • తన ఇంట్లో ప్రవేశించిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి
  • తీవ్రంగా ఖండించిన కేఏ పాల్
  • మీడియా ప్రతినిధులపై దాడి ఘోరం అంటూ వ్యాఖ్యలు 
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తన నివాసంలోకి ప్రవేశించిన మీడియా ప్రతినిధులపై దాడికి దిగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ కూడా స్పందించారు. 

మోహన్ బాబు అయితేనేం, ఇంకెవరైతేనేం... మీడియా ప్రతినిధులపై దాడి చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎంత పెద్దవాళ్లయినా సరే మీడియాపై దాడి చేయడం అన్నది ఘోరం అని పేర్కొన్నారు. 

మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడికి దిగడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.


More Telugu News