తండ్రి మోహ‌న్ బాబుపై ప్రేమ‌తో... మ‌నోజ్ క్రియేట్ చేసిన పాత వీడియో వైర‌ల్!

  • ఇంటి గొడ‌వ‌ల‌తో ఒక్క‌సారిగా వార్త‌ల్లో నిలిచిన మంచు ఫ్యామిలీ
  • నిన్న రాత్రి త‌ర్వాత మ‌రింత ముదిరిన మంచు కుటుంబం వివాదం
  • తాజాగా విష్ణు, మ‌నోజ్ వీడియా స‌మావేశాల‌తో వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం
  • ఈ క్ర‌మంలో మోహ‌న్ బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మ‌నోజ్ పోస్ట్ చేసిన‌ పాత వీడియో వైర‌ల్‌
ఇంటి గొడ‌వ‌ల‌తో మంచు ఫ్యామిలీ ఒక్క‌సారిగా వార్త‌ల్లో నిలిచిన‌ విష‌యం తెలిసిందే. తండ్రి మోహ‌న్ బాబు, కుమారుడు మంచు మ‌నోజ్ మ‌ధ్య పోరు తార‌స్థాయికి చేరింది. నిన్న రాత్రి మ‌నోజ్ ఏకంగా ఇంటిగేట్ల‌ను త‌న్నుకుంటూ వెళ్ల‌డం, ఆ త‌ర్వాత మోహ‌న్ బాబు మీడియా ప్ర‌తినిధిపై చేయి చేసుకోవ‌డం సంచలనం సృష్టించింది. తాజాగా ఈ వివాదంపై మంచు విష్ణు, మంచు మ‌నోజ్ వేర్వేరుగా మీడియా స‌మావేశాలు నిర్వ‌హించి వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. 

ఇదిలాఉంటే... మంచు మ‌నోజ్‌కి త‌న నాన్నంటే ఎంత ప్రేమ‌నో చెప్పడానికి అత‌డు క్రియేట్ చేసిన ఒక పాత వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. మోహ‌న్ బాబు పుట్టినరోజు సంద‌ర్బంగా యానిమల్ సినిమాలోని నాన్న నువ్వు నా ప్రాణం అంటూ సాగే పాట‌పై మ‌నోజ్ ఈ వీడియోను రూపొందించ‌డం జ‌రిగింది. వీడియోలో త‌న తండ్రితో తాను చిన్న‌ప్పటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు క‌లిసి న‌టించిన చిత్రాల తాలూకు ఫుటేజీని మ‌నోజ్ పొందుప‌రిచారు. 

సాంగ్ లిరిక్స్‌కు మ్యాచ్ అయ్యేలా ఆ వీడియోను చాలా బాగా క్రియేట్ చేశారు. "జీవితంలో నువ్వు నేర్పిన పాఠాలకు... నా జీవితానికి ధ‌న్యవాదాలు... పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా" అంటూ మ‌నోజ్ ఈ వీడియోకు లైన్స్‌ రాసుకోచ్చారు. ఇప్పుడీ వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. నెటిజ‌న్లు దీన్ని వైరల్ చేస్తున్నారు. 


More Telugu News