రోజుకు అరగంట వ్యాయామంతో జ్ఞాపకశక్తి మెరుగు: తాజా అధ్యయనంలో వెల్లడి

  • లండన్ యూనివర్సిటీ కాలేజీ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం
  • 50 నుంచి 83 ఏళ్ల వయసున్న 76 మందిపై అధ్యయనం
  • రోజుకు అరగంట వ్యాయాయం, ఆరు గంటల నిద్ర తర్వాత జ్ఞాపశక్తి మెరుగైనట్టు గుర్తింపు
  • ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బిహేవియరల్ న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ’లో అధ్యయన వివరాలు
క్రమం తప్పకుండా చేసే వ్యాయామంతో ఒనగూరే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజూ చేసే వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు టైప్2 డయాబెటిస్ వంటివాటిని దూరంగా ఉంచుతుంది. శరీర బరువును కూడా అదుపులో పెట్టుకోవచ్చు. 

అయితే,  కేవలం అరగంటపాటు వ్యాయామం .. బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్, డ్యాన్సింగ్ వంటివి చేయడం ద్వారా మధ్యవయసు వారు తమ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. గంటల తరబడి వ్యాయామం తర్వాత వారి జ్ఞాపకశక్తి మెరుగవుతుందని గత అధ్యయనాలు చెప్పినప్పటికీ అది ఎంతకాలం అన్న విషయంలో స్పష్టత లేదు.

తాజాగా ‘ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బిహేవియరల్ న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. సగటున 50 నుంచి 83 ఏళ్ల మధ్య వయసున్న వారు మధ్యస్థం నుంచి కఠినమైన వ్యాయామం తర్వాత వారి మెదడు చురుకుదానాన్ని పొంది, జ్ఞాపకశక్తిలో గణనీయమైన మార్పును శాస్త్రవేత్తలు గుర్తించారు. తక్కువ సేపు కూర్చోవడం, ఆరుగంటలు, అంతకుమించి హాయిగా నిద్రపోవడం ద్వారా ఒక రోజల్లా వారిలో జ్ఞాపకశక్తి మెరుగైనట్టు లండన్ యూనివర్సిటీ కాలేజీ శాస్త్రవేత్తలు తెలిపారు. మొత్తం 76 మందిపై 8 రోజులపాటు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాన్ని వారు గుర్తించారు. రోజుకు అరగంటపాటు వ్యాయాయం, కంటి నిండా నిద్ర తర్వాత వారి జ్ఞాపకశక్తిని పరీక్షించేందుకు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించగా మంచి స్కోరు సాధించినట్టు అధ్యయనకారులు తెలిపారు.


More Telugu News