రామ్ చరణ్ కొత్త చిత్రంలో నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై విజయ్ సేతుపతి క్లారిటీ
- బుచ్చిబాబు తొలిచిత్రం 'ఉప్పెన'లో నటించిన సేతుపతి
- రామ్ చరణ్ కొత్త చిత్రంలో తాను నటించడం లేదని స్పష్టం చేసిన విజయ్ సేతుపతి
- త్వరలో తెలుగు సినిమాలో నటిస్తానని వెల్లడి
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న #RC 16 (వర్కింగ్ టైటిల్)లో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీ రోల్ చేస్తున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా పాల్గొన్న ఓ ప్రెస్ మీట్‌లో మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సేతుపతి సమాధానమిచ్చారు.
రామ్ చరణ్ మూవీలో తాను నటించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ మూవీలో నటించేందుకు తనకు సమయం లేదని పేర్కొన్నాడు. ఉప్పెన మూవీలో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విజయ్ సేతుపతికి ఆ మూవీ దర్శకుడు బుచ్చిబాబు మరో అవకాశం ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది.
కాగా, తెలుగు సినిమాల్లో హీరోగా నటిస్తారా అని సేతుపతిని మీడియా ప్రశ్నించగా.. చాలా కథలు వింటున్నానని, అయితే ఏదైనా కథ బాగుంది అనుకుంటే అందులోని హీరో పాత్ర నచ్చడం లేదన్నారు. త్వరలోనే ఓ సినిమా సెట్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు చూపిన ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేనని గతంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తనకు భాషా భేదం లేదని సేతుపతి వెల్లడించారు.