నోటీసులకు స్పందించకపోతే మోహన్ బాబును అరెస్ట్ చేస్తాం: పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు

  • మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదన్న సుధీర్ బాబు
  • విచారణకు మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలని వెల్లడి
  • 24వ తేదీ వరకు మోహన్ బాబు సమయం అడిగారన్న సీపీ
సినీ నటుడు మోహన్ బాబు విషయంలో అంతా చట్ట ప్రకారమే జరుగుతోందని... అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని చెప్పారు. మోహన్ బాబును విచారించేందుకు మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలని తెలిపారు. 

మోహన్ బాబుకు తాము ఇప్పటికే నోటీసులు ఇచ్చామని... అయితే ఆయన డిసెంబర్ 24వ తేదీ వరకు సమయం అడిగారని సీపీ చెప్పారు. కోర్టు కూడా ఆయనకు సమయం ఇచ్చిందని తెలిపారు. 24వ తేదీ తర్వాత నోటీసులకు స్పందించకపోతే మోహన్ బాబును అరెస్ట్ చేస్తామని చెప్పారు.

మోహన్ బాబు దగ్గర ఉన్న గన్స్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో లేవని తెలిపారు. ఆయన వద్ద ఉన్న గన్స్ ను చిత్తూరు జిల్లా చంద్రగిరిలో డిపాజిట్ చేశారని చెప్పారు. తాను దాడి చేయడంతో జర్నలిస్టు గాయపడ్డారు కాబట్టి... ఆయనను పరిమర్శించేందుకు మోహన్ బాబు వెళ్లి ఉంటారని తెలిపారు.


More Telugu News