మోదీ డిక్టేటర్ గా తయారయ్యేందుకు దగ్గరగా ఉన్నారు: ఖర్గే
- రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే
- రాజకీయాల్లో మూఢ భక్తి పనికిరాదని సూచన
ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మరోసారి ప్రధాని మోదీని, బీజేపీ టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. వ్యక్తి పూజ ఎప్పటికీ మంచిది కాదని, ముఖ్యంగా ఓ రాజకీయ నేత పట్ల మూఢ భక్తి ముమ్మాటికీ చేటు అని వ్యాఖ్యానించారు. అలాంటి భక్తి రాజకీయ నేతను నియంతగా మార్చేస్తుందని ఖర్గే హెచ్చరించారు. రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఓ మతం పట్ల భక్తి ఉంటే అది ఆత్మ శుద్ధి కలిగిస్తుంది. కానీ రాజకీయాల్లో భక్తి ఉంటే అది కచ్చితంగా పతనానికి దారితీస్తుంది... అంతిమంగా ఓ నియంతను తయారుచేస్తుంది. మీరందరూ ఇప్పుడు చేస్తున్నది అదే... మీరు (బీజేపీ శ్రేణులు) డప్పు కొడుతూ ఆయన (మోదీ)ను నియంతృత్వం దిశగా నెడుతున్నారు.
ఒకవేళ ఆయన నియంతగా మారేందుకు సిద్ధంగా ఉంటే మాత్రం నేను కోరేది ఒక్కటే... ప్రజాస్వామ్యం ఎప్పటికీ నియంతృత్వ ఛాయల్లో మనుగడ సాగించరాదు... రాజ్యాంగంపై విశ్వాసం ఉన్నవారందరూ అందులోని సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి" అని ఖర్గే స్పష్టం చేశారు.