వివాహబంధంతో ఒక్కటైన వరంగల్ అబ్బాయి.. ఇటలీ అమ్మాయి
- ఉన్నత చదువుల కోసం ఐదేళ్ల క్రితం లండన్ వెళ్లిన వరంగల్ కుర్రాడు సూర్యప్రీతం
- అక్కడ అతనికి ఇటలీ అమ్మాయి మార్తాపేటలోనితో ఏర్పడిన పరిచయం
- ఇప్పుడు మూడుముళ్ల బంధంతో ఒక్కటైన వైనం
ప్రేమకు హద్దులు, సరిహద్దులు ఉండవంటారు.. మనసులు కలిసిన మనుషులను ఏదీ విడదీయలేదు అంటారు. అలా మనసులు కలిసిన ప్రేమ పెద్దల మనసులను కూడా గెలిచి వివాహ వేదికగా ఒక్కటయ్యారు. ఇటలీ అమ్మాయితో ప్రేమలో పడిన వరంగల్ అబ్బాయి.. మనసిచ్చిన ఆమెను పెద్దల అంగీకారంతో పరిణయమాడాడు.
వివరాల్లోకి వెళితే.. వరంగల్ నగరంలోని నవయుగ కాలనీకి చెందిన కోడెపాక సదానందం, ప్రసన్నరాణి దంపతుల కుమారుడు సూర్యప్రీతం ఉన్నత చదువుల కోసం ఐదేళ్ల క్రితం లండన్ వెళ్లాడు. అక్కడ ఇటలీకి చెందిన మార్తాపేటలోని అనే యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారింది.
ఆ తర్వాత ఉన్నత చదువులు పూర్తి చేసుకుని లండన్‌లోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పారు. వారి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దాంతో బుధవారం దేశాయిపేటలోని సీఎస్ఐ పరిశుద్ధ మత్తయి చర్చిలో కుటుంబ సభ్యులు, బంధువుల, మిత్రుల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు.