మోహన్ బాబు పిటిషన్ పై తీర్పు సోమవారానికి వాయిదా

  • ఇటీవల టీవీ జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి
  • గాయపడి ఆసుపత్రిపాలైన జర్నలిస్టు
  • మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు
  • ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మోహన్ బాబు
  • హైకోర్టులో ముగిసిన విచారణ
మోహన్ బాబు పిటిషన్ పై తీర్పు సోమవారానికి వాయిదా
ఇటీవల ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఓ టీవీ జర్నలిస్టుపై మైక్ తో దాడి చేయడం తెలిసిందే. ఆ జర్నలిస్టు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలయ్యాడు. కాగా, ఈ ఘటనలో మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పీఎస్ లో హత్యాయత్నం కేసు నమోదు కాగా, ఆయన తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పును సోమవారానికి (ఈ నెల 23) వాయిదా వేశారు. 

ఇటీవల కొన్ని రోజుల పాటు మోహన్ బాబుకు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ కు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద ఇరు వర్గాలు బౌన్సర్లను రంగంలోకి దింపడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

కవరేజికి వెళ్లిన టీవీ9 చానల్ జర్నలిస్టు రంజిత్ కుమార్ ను మోహన్ బాబు మైక్ తో కొట్టగా... అతడి తలభాగంలో చెవికి, కంటికి మధ్య డ్యామేజి జరిగినట్టు వైద్యపరీక్షల్లో వెల్లడైంది. మోహన్ బాబు... ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ జర్నలిస్టు వద్దకు వెళ్లి ఇప్పటికే క్షమాపణ కూడా చెప్పారు.


More Telugu News