మా నాన్నను క్షమించి వదిలేయండి.. రవిచంద్రన్ అశ్విన్

  • అశ్విన్ రిటైర్మెంట్ వెనక అవమానాలు ఉండి ఉండొచ్చన్న రవిచంద్రన్
  • ఆయనకు మీడియా ముందు ఎలా మాట్లాడాలో తెలియదన్న అశ్విన్
  • ఆ వ్యాఖ్యలను పట్టించుకోవద్దని, ఆయనను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి
తన రిటైర్మెంట్‌పై తండ్రి రవిచంద్రన్ చేసిన వ్యాఖ్యలపై అశ్విన్ స్పందించాడు. ఆయనకు మీడియా ముందు ఎలా మాట్లాడాలో తెలియదని, ఆయనను క్షమించి వదిలిపెట్టాలని కోరాడు. అశ్విన్ రిటైర్మెంట్‌పై రవిచంద్రన్ స్పందిస్తూ.. అతడి అకస్మాత్తు రిటైర్మెంట్ వెనక అవమానాలు ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. 

రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా అతడిదే అయినా, అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కొన్ని కారణాలున్నాయని, అవి అశ్విన్‌కే తెలుసని రవిచంద్రన్ చెప్పుకొచ్చారు. ఆ కారణం బహుశా అవమానాలు ఎదుర్కోవడమే అయి ఉంటుందన్నారు. అవమానాలను ఎన్నాళ్లని భరిస్తాడని పేర్కొన్నారు. 15 ఏళ్లుగా క్రికెడ్ ఆడుతున్న అశ్విన్ నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేందని, తమకు కూడా ఈ విషయాన్ని ఆలస్యంగా చెప్పాడన్నారు.

ఈ వ్యాఖ్యలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అశ్విన్ స్పందించక తప్పలేదు. మీడియాతో ఎలా మాట్లాడాలో తన తండ్రికి తెలియదని, ఆయన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవద్దని కోరాడు. తన తండ్రిని క్షమించి వదిలిపెట్టాలని, ఆయనను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశాడు. 


More Telugu News