ఓటీటీలో పుష్ప-2 అంటూ వార్తలు... క్లారిటీ ఇచ్చిన చిత్రబృందం

  • సోషల్ మీడియా వార్తలపై స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్
  • పుష్ప- 2 విడుదలైన 56 రోజుల వరకూ ఓటీటీలో స్ట్రీమింగ్ కాదని స్పష్టం చేసిన చిత్ర బృందం
  • వెండితెరపైనే పుష్ప-2ను చూసి హాలిడే సీజన్‌ను ఎంజాయ్ చేయమన్న చిత్ర బృందం  
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప- 2: ది రూల్ బ్లాక్‌ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవ్వగా, వసూళ్ల పరంగా ఈ చిత్రం ఊచకోత కోస్తోంది. ఈ క్రమంలో పుష్ప- 2 ఓటీటీకి రానున్నదంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 

జనవరి రెండో వారం నుంచి పుష్ప- 2 స్ట్రీమింగ్ కానుందంటూ సోషల్ మీడియాలో పుకారు షికారు చేస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం (మైత్రీ మూవీ మేకర్స్) ఎక్స్ వేదికగా స్పందించింది. 56 రోజుల (థియేటర్లలో విడుదలైన నాటి నుంచి) కంటే ముందు ఏ ఓటీటీలో కూడా ఈ మూవీ విడుదల కాదని చిత్ర బృందం స్పష్టం చేసింది. వెండితెరపైనే పుష్ప- 2ను చూసి హాలిడే సీజన్‌ను ఎంజాయ్ చేయమని వెల్లడించింది.  
 
'పుష్ప- 2: ది రూల్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై అనేక వార్తలు వస్తున్నాయి. రాబోయే అతి పెద్ద హాలీడే సీజన్‌లో ఈ మూవీని వెండితెరపై చూసి ఆస్వాదించండి. విడుదలైన నాటి నుంచి 56 రోజుల కన్నా ముందు ఏ ఓటీటీలోనూ పుష్ప- 2 స్ట్రీమింగ్ కాదు. ఇది వైల్డ్ ఫైర్ పుష్ప. వరల్డ్ వైడ్‌గా థియేటర్‌లోనే' అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చింది. 


More Telugu News