ఏపీలో మద్యం ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్!
ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం ప్రియులకు లిక్కర్ కంపెనీలు బ్రహ్మాండమైన శుభవార్త చెప్పాయి. మద్యం బేసిక్ ధరలను గణనీయంగా తగ్గించాయి. ఫలితంగా క్వార్టర్‌పై దాదాపు రూ. 30 తగ్గింది. మొత్తం 11 కంపెనీలు ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో మాయమైన బ్రాండెడ్ కంపెనీల మద్యం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఇటీవల ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించింది. దీంతో కొంత తగ్గిన ధరలు ఇప్పుడు మరింత తగ్గాయి. కంపెనీల నిర్ణయంతో ఆయా తయారీ సంస్థల నుంచి రాష్ట్ర బేవరేజస్ సంస్థ కొనుగోలు చేసే మద్యం ధర తగ్గడంతో ఆ మేరకు వినియోగదారులకు ఊరట కలగనుంది.