నాంపల్లి కోర్టు సంచలన తీర్పు .. హత్య కేసు నిందితుడికి మరణ శిక్ష
- భార్య, అతని స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన భర్త
- మంటల్లో కాలి చిన్నారి సహా ముగ్గురు మృతి
- ముద్దాయికి సహకరించిన స్నేహితుడికి యావజ్జీవ శిక్ష
హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ముగ్గురు మృతికి కారణమైన ముద్దాయికి కోర్టు మరణశిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడలో నాగులు సాయిలు, ఆర్తి అనే దంపతులు పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో భర్తకు దూరంగా ఉండాలని ఆర్తి నిర్ణయించుకుని వెళ్లిపోయింది.
ఆ తర్వాత నాగరాజు అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నదన్న అనుమానంతో ఆర్తిని పలు మార్లు సాయిలు హెచ్చరించాడు. అయినా ఆమె వినకుండా నాగరాజుతో కలిసి ఉండటాన్ని గమనించి ఇద్దరిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో పది నెలల చిన్నారి సైతం తీవ్రంగా గాయపడింది. చికిత్స పొందుతూ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన 2022 లో జరిగింది.
ఆర్తి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు .. సాయిలు, అతనికి సహకరించిన స్నేహితుడు రాహుల్‌ను అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టులో సుదీర్ఘ వాదనల అనంతరం శుక్రవారం న్యాయమూర్తి సంచలన తీర్పు వెలువరించారు. చిన్నారితో సహా ముగ్గురి మృతికి కారణమైన సాయిలుకి మరణశిక్ష విధిస్తూ, అతనికి సహకరించిన స్నేహితుడు రాహుల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించారు.