'గేమ్ చేంజర్’తో రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు పక్కా: సుకుమార్
- అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
- ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు సుకుమార్
- శంకర్-రామ్ చరణ్ కాంబోలో సినిమా అనగానే సంతోషించానని వెల్లడి
- గేమ్ చేంజర్ ఫస్ట్ హాఫ్ అద్భుతమని వెల్లడి
- సెకండాఫ్ ఫినామినల్ అంటూ వ్యాఖ్యలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను 'ఛరిష్మా డ్రీమ్స్' రాజేశ్ కల్లేపల్లి ఆధ్వర్యంలో అమెరికాలోని డాలస్ సిటీలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
సుకుమార్ మాట్లాడుతూ... "ఓవర్సీస్ ఆడియెన్స్ తెలుగు సినిమాల్ని ఎక్కువగా ఆదరిస్తుంటారు. వన్ నేనొక్కడినే మూవీని ఇక్కడి ఆడియెన్స్ ఆదరించి ఉండకపోతే నాకు నెక్స్ట్ సినిమాలు వచ్చేవి కావు. దిల్ రాజు గారు నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. నన్ను నిలబెట్టినందుకు దిల్ రాజు గారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. శంకర్ గారి చేతుల మీదుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకున్నాను.
రంజీవి గారు ఎందుకు శంకర్ గారితో సినిమా చేయలేదు.. శంకర్ గారు ఎందుకు తెలుగు సినిమా చేయడం లేదు? అని అనుకునేవాళ్లం. కానీ శంకర్ గారితో రామ్ చరణ్ సినిమా అని తెలియగానే తెగ ఆనంద పడ్డాను. ఈ విషయాన్ని రామ్ చరణ్ మొదటగా నాకే చెప్పినట్టున్నాడు.
ఎస్.జె. సూర్య తీసిన ఖుషి నాకు చాలా ఇష్టం. రైటర్‌గా వచ్చి డైరెక్టర్‌గా చేశాను. ఖుషి సినిమాను రిఫరెన్సుగా పెట్టుకున్నాను. అంజలి మా ఊరు అమ్మాయి. చాలా బాగా నటించింది. నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తమన్ సాయం చేశాడు. కానీ అది నేను వాడుకోలేకపోయాను.
ఓ హీరోతో సినిమా చేసినప్పుడు ఆ హీరోని ఎక్కువగా ప్రేమిస్తాను. రంగస్థలం అయిపోయాక కూడా ఆ అనుబంధం రామ్ చరణ్‌తో మాత్రమే కొనసాగింది. రామ్ చరణ్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాను. చిరంజీవి గారితో కలిసి ఈ గేమ్ చేంజర్ చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతం... ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్... సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్, ఫినామినల్...! జెంటిల్మెన్, భారతీయుడు చిత్రాలను ఎంతగా ఎంజాయ్ చేశానో మళ్లీ అంతే ఎంజాయ్ చేశాను.
రంగస్థలం తరువాత రామ్ చరణ్‌కు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాను. కానీ రాలేదు. ఇక గేమ్ చేంజర్ క్లైమాక్స్‌లో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు పక్కాగా వస్తుంది" అని అన్నారు.
మా జర్నీ ప్రారంభమైంది శంకర్ సినిమాతోనే: దిల్ రాజు
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ... "డల్లాస్‌లో ఈవెంట్ గురించి రాజేష్‌తో మాట్లాడాం. అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. ఈవెంట్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. 1998లో ఒకే ఒక్కడు సినిమాతో మా జర్నీ ప్రారంభం అయింది. శంకర్ గారు, చంద్రబాబు గారి చేతుల మీదుగా వంద రోజుల షీల్డ్ తీసుకున్నాం. శంకర్ గారు నిర్మించిన వైశాలి మూవీని తెలుగులో రిలీజ్ చేశాను. అలా శంకర్ గారితో జర్నీ చేస్తున్న మేం ఇలా గేమ్ చేంజర్‌ను నిర్మించాం.
శంకర్ గారు మాతో సినిమా చేయాలని, తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నారని మా కో-డైరెక్టర్ గారి ద్వారా తెలిసింది. రామ్ చరణ్ అప్పుడు ఆర్ఆర్ఆర్ షూట్‌లో ఉన్నారు. అప్పుడు ఈ కథ ఆయనకు చెప్పడం, నచ్చడం అలా జర్నీ మొదలైంది. మా బ్యానర్లో ఇది 50వ సినిమా. ఇంత పెద్ద బడ్జెట్‌తో నేను ఎప్పుడూ సినిమాలు తీయలేదు. కరోనా వల్ల కాస్త ఆలస్యం అయింది.
డోప్ సాంగ్‌ను ముందుగా నేను ఫోన్‌లో చూశా. ఈ పాటను డల్లాస్‌లో రిలీజ్ చేస్తున్నామని తెలిసి నాకు సంతోషం వేసింది. ఈ పాటను చూసినప్పుడు నాకు కంట్లోంచి ఆనందబాష్పాలు వచ్చాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వల్లే ఈ సినిమా ఈ స్థాయికి వచ్చింది.
నేను చిరంజీవి గారి చిత్రాలను ఆడియెన్‌గా చూసి ఎంజాయ్ చేశా. కానీ తొలిప్రేమ సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా ఎంజాయ్ చేశాను. కళ్యాణ్ గారితో సినిమా తీయడానికి నాకు చాలా టైం పట్టింది. మెగా ఫ్యామిలీతో ఉన్న బాండింగ్‌తో ఎవడు చేశాం. అది రిలీజై 11 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు గేమ్ చేంజర్‌తో మళ్లీ సంక్రాంతికి రాబోతోంది. ఈ సారి మామూలుగా కొట్టడం లేదు. గట్టిగా కొట్టబోతోన్నాం.
రామ్ చరణ్, సూర్య గారికి మధ్య జరిగే సీన్లు నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. రెండు రాష్ట్రాల్లో జరిగే రాజకీయ అంశాలు చాలా కనిపిస్తాయి. కానీ ఇవన్నీ నాలుగేళ్ల క్రితం శంకర్ గారు రాసుకున్నారు. అవి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. తమన్ మంచి సంగీతాన్ని ఇచ్చాడు. శంకర్ గారే మా అందరినీ ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఓ తెలుగు సినిమాకు ఇలా మొదటి సారిగా ఇక్కడ ఈవెంట్ నిర్వహించి గేమ్ చేంజర్‌తో... గేమ్ చేంజ్ చేశాం. సుకుమార్‌ని నేను పరిచయం చేయలేదు. మా ఇద్దరి జర్నీ ఒకేసారి ప్రారంభం అయింది. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ పెద్ద హిట్ కాబోతోంది" అని ధీమా వ్యక్తం చేశారు.
రామ్ చరణ్ కాలేజ్ లుక్ లో చాలా ఫైర్ ఉంటుంది: దర్శకుడు శంకర్
డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ... "దిల్ రాజు గారు చాలా బాగా మాట్లాడారు. సినిమా గురించి అంతా చెప్పేశారు. నేను ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాను. ఇక్కడకు రావాలా? వద్దా? అనుకున్నాను. కానీ మీ అందరి కోసం వచ్చాను. పోకిరి, ఒక్కడు లాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్ చేయాలని అనుకున్నాను. కానీ అందులో కూడా నా మార్క్ ఉండాలని అనుకున్నాను. అలాంటి ఓ సినిమానే గేమ్ చేంజర్. తమిళంలో, హిందీలో చిత్రాలు చేశాను. కానీ నేను ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. అయినా మీరు నా మీద ప్రేమను చూపిస్తూనే వచ్చారు.
చిరంజీవి గారితో సినిమా చేయాలని ఎంతో ప్రయత్నించాను. కానీ అది జరగలేదు. ఆ తరువాత మహేశ్ బాబుతో చేయాలని అనుకున్నాను. ఆపై ప్రభాస్‌తో కరోనా టైంలో చర్చలు జరిగాయి. కానీ వర్కౌట్ కాలేదు. రామ్ చరణ్‌తోనే సినిమా చేయాలని రాసి పెట్టి ఉంది. అందుకే ఈ గేమ్ చేంజర్ వచ్చింది.
గవర్నమెంట్ ఆఫీసర్, పొలిటీషియన్ మధ్య వచ్చే ఘర్షణ, వార్ మీదే ఈ చిత్రం ఉంటుంది. రామ్ చరణ్ గారు ఎంతో సెటిల్డ్‌గా నటించారు. కాలేజ్ లుక్‌లో చాలా ఫైర్ ఉంటుంది. పంచెకట్టులో అప్పన్నగా అద్భుతంగా నటించారు. సాంగ్స్‌లో అదిరిపోయే స్క్రీన్ ప్రజెన్స్, అద్భుతమైన డ్యాన్స్‌లతో రామ్ చరణ్ మెస్మరైజ్ చేశారు.
ఒక్కో సీన్, ఒక్కో డైలాగ్‌ను ఎస్ జే సూర్య ఎంతో అద్భుతంగా చేశారు. అంజలి గారు నేచురల్ యాక్టర్. సర్ ప్రైజ్ అండ్ షాకింగ్‌గా ఆమె పాత్ర ఉంటుంది. శ్రీకాంత్ గారు, బ్రహ్మానందం గారు, సునీల్ గారు,వెన్నెల కిషోర్ గారు ఇలా చాలా మంది సినిమా కోసం పని చేశారు. దిల్ రాజు అంతా తానై ముందుకు నడిపించారు. ప్రతీ రోజూ సెట్స్ మీదకు వచ్చి అన్ని పనుల్ని చక్కబెట్టేవారు. అదే ఆయన సక్సెస్ మంత్రం.
తెలుగు సినిమాలో తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలని అనుకున్నాను. రెహమాన్ గారే నా సినిమాలకు సంగీతాన్ని ఇస్తుంటారు. తమన్ మీద చాలా బాధ్యత, ఒత్తిడి ఉండేది. కానీ ఆయన అద్భుతమైన పాటల్ని ఇచ్చారు. సుకుమార్ పుష్ప 2తో పెద్ద విజయాన్ని అందుకున్నారు. మా కోసం ఇక్కడకు వచ్చిన సుకుమార్ గారికి థాంక్స్. సోషియో, పొలిటికల్, మాస్ ఎంటర్టైనర్‌గా గేమ్ చేంజర్ రాబోతోంది" అని అన్నారు.