వాట్సాప్ పై నిషేధం దిశగా రష్యా!

  • వాట్సాప్‌పై కీలక నిర్ణయం తీసుకోబోతున్న రష్యా
  • చట్టాలకు లోబడి ఉండకపోతే నిషేధం విధిస్తామని స్పష్టం చేసిన రష్యన్ అధికారులు
  • ఇక తేల్చుకోవాల్సింది వాట్సాప్ యాజమాన్యమేనని వ్యాఖ్య 
వాట్సాప్‌పై రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 2025 నూతన సంవత్సరంలో వాట్సాప్‌కు రష్యా షాక్ ఇచ్చే నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. వాట్సాప్‌పై రష్యా నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విదేశీ యాప్‌లు తమ చట్టాలకు లోబడి ఉండకపోతే నిషేధం విధిస్తామని రష్యన్ అధికారులు హెచ్చరించారు. కీలక సమాచారాన్ని భద్రతా సిబ్బందితో షేర్ చేసుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 
 
ఈ అంశంపై రష్యా సెనేటర్ ఆర్టియోమ్ షేకిన్, డుమా అధికారి ఒలేగ్ మాట్వేచెవ్ మాట్లాడారు. రష్యన్ నిబంధనలు పాటించాలా? లేక నిష్క్రమించాలా? అనేది వాట్సాప్‌ యాజమాన్యానికే వదిలివేసినట్లు వారు తెలిపారు. దేశంలోని భద్రతా సేవలతో యూజర్ సమాచారాన్ని ప్లాట్‌ ఫామ్ షేర్ చేసుకోకపోతే వచ్చే ఏడాది నుంచి వాట్సాప్‌ను బ్లాక్ చేయగలమని సెనేటర్ అర్టియోమ్ షేకిన్ రాష్ట్ర వార్త సంస్థ ఆర్ఐఏ నోవోస్టితో అన్నారు. విదేశీ కంపెనీలు తమ చట్టాన్ని పాటించాలని, లేకుంటే వాటి పని ఆసాధ్యమని పేర్కొన్నారు. 

ఇప్పటికే మెటా యాజమాన్యంలోని యాప్‌లు ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లపై రష్యాలో నిషేధం కొనసాగుతోంది. 2022 నుంచే ఇవి రష్యాలో నిషేధించబడ్డాయి. తాజా హెచ్చరికలతో వాట్సాప్ ‌పైనా నిషేధం విధించే అవకాశాలు కనబడుతున్నాయి. 


More Telugu News