‘పల్లె పండుగ’లో మన్యం గ్రామాలకు రోడ్లు.. డిప్యూటీ సీఎంవో ట్వీట్
---
పల్లె పండుగ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరూవాడా సీసీ రోడ్లు, తారు రోడ్లు, కాలువల నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేపట్టిన రోడ్ల నిర్మాణం ఫొటోలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆఫీస్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. వైసీపీ పాలనలో అధ్వాన్నంగా తయారైన రోడ్ల వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను కూటమి ప్రభుత్వం తీరుస్తోందని పేర్కొంది. మన్యం గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి రోడ్లు నిర్మిస్తున్నామని వివరించింది. అరకు లోయ నియోజకవర్గంలోని హుకుంపేట మండలంలో గూడ రోడ్డు నుంచి మర్రిపుట్టు మీదుగా సంతబయలు వరకు 2 కి.మీ మేర తారు రోడ్డు నిర్మించినట్లు అధికారులు తెలిపారు.
గూడ రోడ్డు నుంచి సంతబయలుకు వెళ్లే దారి గతంలో ఇలా..
ప్రస్తుతం ఇలా మారిపోయింది..
గూడ రోడ్డు నుంచి సంతబయలుకు వెళ్లే దారి గతంలో ఇలా..
ప్రస్తుతం ఇలా మారిపోయింది..