పీవీ నర్సింహారావు, వాజపేయి మధ్య మంచి అనుబంధం ఉండేది: అనురాగ్ ఠాకూర్

  • కార్పోరేటర్ స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగిన వ్యక్తి వాజపేయి అని వ్యాఖ్య
  • వాజపేయి ఆశయాలను ప్రధాని మోదీ నెరవేరుస్తున్నారన్న కేంద్రమంత్రి
  • ఒక్క ఓటుతో అధికారం కోల్పోయినా వాజపేయి రాజనీతిని తప్పలేదన్న కేంద్రమంత్రి
తెలుగువాడైన పీవీ నర్సింహారావు, అటల్ బిహారీ వాజపేయి మధ్య మంచి అనుబంధం ఉండేదని కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో వాజపేయి శతజయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్పోరేటర్ స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగిన వ్యక్తి వాజపేయి అన్నారు.

వాజపేయి ఆశయాలను ప్రధాని నరేంద్రమోదీ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. నాడు ఒక్క ఓటుతో అధికారం కోల్పోతున్నామని తెలిసినప్పటికీ వాజపేయి మాత్రం రాజనీతిని మాత్రం తప్పలేదని గుర్తు చేశారు.

దేశంలో పాస్‌పోర్ట్ రావాలంటే ఏళ్ల తరబడి చూడాల్సి వచ్చేదని, వాజపేయి విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. నిస్వార్థంగా, సిద్ధాంతాల కోసం పని చేసే లక్షలాదిమంది యువతను రాజకీయాల్లోకి తీసుకు రావాలనేది వాజపేయి కల అన్నారు.


More Telugu News