దోహాలో ఉద్యోగం వచ్చిన గంటల్లోనే భారత యువ ఇంజినీర్ మృతి

    
ఉద్యోగం సంపాదించిన కాసేపటికే భారత్‌కు చెందిన ఓ యువ ఇంజినీర్ ఖతర్‌లోని దోహాలో గుండెపోటుతో మృతి చెందాడు. బాధితుడిని కేరళ, తిరువనంతపురంలోని పళ్లినడకు చెందిన 22 ఏళ్ల రాయీస్ నజబ్‌గా గుర్తించారు. బాధిత యువకుడికి తల్లిదండ్రులతోపాటు సోదరుడు, సోదరి ఉన్నారు. 

యూకేలో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసిన రాయీస్ ఉద్యోగం కోసం ఖతర్ చేరుకున్నాడు. దుబాయ్‌లోని ఓ కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ అందుకున్న రోజునే గుండెపోటుతో మృతి చెందినట్టు స్థానిక పత్రికలు తెలిపాయి. అతడి మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 


More Telugu News