బాక్సింగ్ డే టెస్టు.. ముగిసిన రెండోరోజు ఆట.. మళ్లీ టీమిండియా తడబాటు
- మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు
- రెండోరోజు ఆట ముగిసేసయమానికి భారత్ స్కోరు 164/5
- హాఫ్ సెంచరీ (82) తో రాణించిన యశస్వి జైస్వాల్
- తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 474 రన్స్‌కు ఆలౌట్
- ఆసీస్ కంటే ఇంకా 310 పరుగుల వెనుకంజలో భారత్
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ (82) తో రాణించగా.. విరాట్ కోహ్లీ (36), కేఎల్ రాహుల్ (24) రన్స్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 3 రన్స్‌కే పెవిలియన్ చేరాడు. దాంతో టీమిండియా 8 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత కేఎల్ రాహుల్ (24) క్రీజులో కుదురుకున్నట్లు కనిపించాడు. కానీ కమిన్స్ వేసిన ఓ చక్కటి బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 51 పరుగుల వద్ద రెండో వికెట్ పారేసుకుంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా పడ్డాడు. మరోవైపు ఓపెనర్ యశస్వి దాటిగా బ్యాటింగ్ చేసి, అర్ధ శతకం నమోదు చేసుకున్నాడు.
ఈ ద్వయం 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత శిబిరంలో ఆనందం నింపింది. కానీ, ఆ సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు. యశిస్వి రనౌట్ కావడంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే కోహ్లీ కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఇక నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన ఆకాశ్ దీప్ డకౌట్ అయ్యాడు. దీంతో భారత్ 159 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులకు ఆలౌట్ అయిన విషం తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోర్ 311/6 తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆతిథ్య జట్టు మరో 163 పరుగులు జోడించి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత సెంచరీ (140) సాధించగా.. సామ్ కాన్స్టాస్ (60), ఉస్మాన్ ఖావాజా (57), లబుషేన్ (72) అర్ధ శతకాలు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా. రవీంద్ర జడేజా 3, ఆకాశ్ దీప్ 2, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 164/5 కాగా.. క్రీజులో రిషభ్ పంత్ (06), రవీంద్ర జడేజా (04) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బొలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆసీస్ కంటే భారత్ ఇంకా 310 పరుగుల వెనుకంజలో ఉంది.