కోహ్లీపై నోరుపారేసుకున్న ఆస్ట్రేలియా అభిమానులు.. ఆగ్రహంతో ఊగిపోయిన స్టార్ బ్యాటర్.. వీడియోలు వైరల్!
- ముదురుతున్న కోహ్లీ, కాన్‌స్టాస్ వివాదం
- ఈ వివాదం నేపథ్యంలో విరాట్‌పై ఆసీస్ మీడియా, ఫ్యాన్స్ దూషణలు
- అయినా వెనక్కి తగ్గని కోహ్లీ
- పెవిలియన్ కు వెళ్లే క్రమంలో అభిమానులపై ఆగ్రహం
భారత్-ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, సామ్ కాన్‌స్టాస్‌తో మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం ఘటన దుమారం రేపింది. ఈ ఘటన నేపథ్యంలో కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియా మీడియా, మాజీ ఆటగాళ్లు మనోడిపై ఓ రేంజ్‌లో దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు ఆసీస్ అభిమానులు కూడా విరాట్‌ను వదిలిపెట్టలేదు.
కోహ్లీ మైదానంలో ఉండగా తీవ్రమైన దూషణలు చేశారు. ‘కోహ్లీ ఓ అడవి కుక్క’ అంటూ ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. దీని తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అతను ఫీల్డింగ్ చేసినా, బ్యాటింగ్ చేసినా లేదా పెవిలియన్‌కు తిరిగి వెళ్లినా స్థానిక ప్రేక్షకులు కోహ్లీని దూషించడం ఆపలేదు. బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ ప్రారంభ రోజే అరంగేట్ర ఆటగాడు సామ్ కాన్‌స్టాస్‌ను కోహ్లీ ఢీకొట్టడంతో ఈ వివాదం మొదలైంది. దీంతో ఇరువురు ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇక కోహ్లీ వివాదాలకు కేంద్రబిందువు కావడం ఇదే తొలిసారి కాదు. ఈ సిరీస్‌లో మూడో టెస్టు ముగిసిన తర్వాత విమానాశ్రయానికి వెళ్లిన కోహ్లీ తన పిల్లల ఫొటోలు తీయడానికి ప్రయత్నించిన ఆస్ట్రేలియన్ జర్నలిస్టులతో గొడవ పడ్డాడు. ఈ ఘటన ఆస్ట్రేలియన్లతో అతని వివాదానికి మరింత ఆజ్యం పోసింది.
ఆసీస్ ఫ్యాన్స్ దూషణలు.. విరాట్ ఆగ్రహం
మెల్‌బోర్న్ టెస్టు రెండో రోజు 36 పరుగుల వద్ద ఔటయ్యాక కోహ్లీ తిరిగి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న సమయంలో ఆసీస్ అభిమానులు అతనిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో గేలి చేశారు. దీంతో విరాట్ వెనక్కుతిరిగి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో సెక్యూరిటీ మేనేజర్ అక్కడికి వచ్చి కోహ్లీకి సర్దిచెప్పి డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు.
ఈ ఘటనపై ఆస్ట్రేలియా అభిమానుల వక్రబుద్ధి ఇలాగే ఉంటుందని భారత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటలో విమర్శలు సహజం కానీ అసభ్యకరంగా మాట్లాడటం తగదని పోస్టులు పెడుతున్నారు. ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మరో మ్యాచ్ మిగిలి ఉన్నందున ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.