నవంబరు నెలలో తిరుమల శ్రీవారి ఆదాయం రూ.113 కోట్లు
- గత నెలలో వెంకన్నను దర్శించుకున్న 20.37 లక్షల మంది భక్తులు
- తలనీలాల మొక్కు సమర్పించుకున్న వారి సంఖ్య 7.31 లక్షలు
- వివరాలు వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
నవంబరు నెలలో తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా రూ.113 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. గత నెలలో స్వామివారిని రూ.20.37 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, 97 లక్షల లడ్డూలు విక్రయించామని వివరించారు.
7.31 లక్షల మంది భక్తులు వెంకటేశ్వరస్వామి వారికి తలనీలాల మొక్కు సమర్పించుకున్నారని... 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారని బీఆర్ నాయుడు తెలిపారు.
గరుడాద్రి పర్వతానికి కొత్త వెలుగులు
కాగా, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో గరుడాద్రి పర్వత శ్రేణుల వద్ద టీటీడీ విద్యుత్ సిబ్బంది ఆకర్షణీయమైన లైటింగ్ ఏర్పాటు చేశారు. గరుడాద్రి పర్వతం... తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డు చివరలో ఉంటుంది. గత ఐదేళ్లుగా అక్కడ లైట్లు లేవని తెలుస్తోంది. ఇటీవలే టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడు దీనిపై దృష్టి సారించారు.
తాజాగా విద్యుత్ సిబ్బంది ఇక్కడ లైట్లు ఏర్పాటు చేయడంతో గరుడాద్రి పర్వతం వెలుగులు విరజిమ్ముతోంది. అంతేకాదు. ఘాట్ రోడ్డును ఆనుకుని ఉండే వినాయక ఆలయం వద్ద ట్రయల్ రన్ కింద ఆరు ఫోకస్ లైట్లను ఏర్పాటు చేశారు.