మన్మోహన్ స్మారకచిహ్నం కోసం కేంద్రం స్థలం కేటాయిస్తుంది... అయినా కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది: కిషన్ రెడ్డి
- మాజీ ప్రధానులకు నిబంధనల ప్రకారమే స్మారక స్థల కేటాయింపు ఉంటుందన్న కిషన్ రెడ్డి
- ఖర్గేకు, మన్మోహన్ కుటుంబ సభ్యులకు అమిత్ షా కూడా తెలిపారన్న కేంద్రమంత్రి
- కాంగ్రెస్ రాజవంశానికి చెందని ఆ పార్టీ ప్రధానులను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శ
మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తుందని, ఇది మాజీ ప్రధానులందరికీ నిబంధనల ప్రకారమే జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మన్మోహన్ సింగ్ మరణాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఇది తమను నిరుత్సాహపరిచిందన్నారు.
మన్మోహన్ అంత్యక్రియల విషయంలో తన వైఖరితో బీజేపీ ప్రభుత్వం ఆయనను అవమానించిందని, అంత్యక్రియలను అధికారిక స్మశాన వాటికలో కాకుండా నిగంబోధ్ ఘాట్ వద్ద జరిపిందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఈ విమర్శలపై కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
నిబంధనల ప్రకారం మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం స్థల కేటాయింపు జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా... ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, మన్మోహన్ కుటుంబ సభ్యులకు తెలియజేశారని, కానీ కాంగ్రెస్ మాత్రం రాజకీయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ రాజవంశానికి చెందని (నెహ్రూ, గాంధీ కుటుంబానికి చెందని) ప్రధానులు పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేత ప్రణబ్ ముఖర్జీ వంటి వారిని ఆ పార్టీ నిరంతరం మోసం చేస్తూ... అవమానాలకు గురి చేసిందని ఆరోపించారు. ఈ విషయం చరిత్రే చెబుతోందన్నారు. మన్మోహన్ మరణానికి కాంగ్రెస్ సంతాపం తెలియజేసినప్పటికీ... ఆ పార్టీ ఆయనకు చేసిన అవమానాలను మనం విస్మరించకూడదన్నారు.