ఈ బుల్లెట్ రైలు వేగం గంటకు 450 కి.మీ.. వీడియో ఇదిగో!
- సరికొత్త రైలును ప్రపంచానికి పరిచయం చేసిన చైనా
- తొందర్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడి
- ఇంజన్ పరీక్షల్లో 453 కి.మీ. వేగం అందుకుందని వివరణ
అత్యంత వేగంతో దూసుకుపోయే సరికొత్త బుల్లెట్ రైలును చైనా తయారుచేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న బుల్లెట్ రైళ్లతో పోలిస్తే తాజాగా తయారుచేసిన రైలు వేగం చాలా ఎక్కువని తెలిపింది. సీఆర్ 450గా వ్యవహరిస్తున్న ఈ బుల్లెట్ రైలు గంటకు 450 కి.మీ. వేగంతో దూసుకెళుతుందని వివరించారు. ఈ రైలును ఆదివారం బీజింగ్ లో అధికారులు పరీక్షించి చూశారు. ఇంజిన్ పరీక్షలో గంటకు 453 కి.మీ. వేగం అందుకుందని వెల్లడించారు.
సీఆర్ 450 అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా నిలుస్తుందని అధికారులు చెప్పారు. బీజింగ్ నుంచి షాంఘైకి ప్రస్తుతం నాలుగు గంటల సమయం పడుతుండగా.. సీఆర్ 450 రైలులో కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ రైలు బాడీ బరువు కేవలం 10 టన్నులు మాత్రమే. ప్రస్తుతం సీఆర్400 మోడల్ కంటే ఇది 12 శాతం తక్కువ. విద్యుత్తును కూడా 20 శాతం తక్కువగానే వినియోగించుకుంటుందని చెప్పారు.