హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో అగ్ని ప్రమాదం

  • రాజరాజేశ్వరి కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం
  • మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
  • ప్రమాద తీవ్రతకు భయంతో బయటకు పరుగు తీసిన ప్రజలు
హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజరాజేశ్వరి కాలనీలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని తొమ్మిదో అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది.

గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతకు అపార్ట్‌మెంట్ వాసులు భయంతో తమ నివాసాల నుంచి బయటకు వచ్చారు.


More Telugu News