న్యూ ఇయర్ వేడుకల కోసం వెళ్లి.. గోవాలో హత్యకు గురైన తాడేపల్లిగూడెం యువకుడు!
- హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రవితేజ
- ఏడుగురు స్నేహితులతో కలిసి గోవాకు
- రెస్టారెంట్‌లో ధరల విషయంలో గొడవ
- హోటల్ సిబ్బంది కర్రలతో దాడి.. అక్కడికక్కడే మృతి
న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లిన తాడేపల్లిగూడెం యువకుడు అక్కడ హత్యకు గురయ్యాడు. స్థానిక ఆరో వార్డుకు చెందిన బొల్లా రవితేజ (28) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఏడుగురు స్నేహితులతో కలిసి గత శనివారం హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాడు. సోమవారం రాత్రి కలంగుట్ బీచ్‌లో వీరంతా సరదాగా గడిపారు. అనంతరం మరీనా బీచ్‌షాక్ అనే రెస్టారెంట్‌లో భోజనం చేసేందుకు వెళ్లారు.
అందులో ధరలు అధికంగా ఉండటం చూసి వారితోపాటు వెళ్లిన యువతి నిర్వాకుడిని ప్రశ్నించింది. ఇది వారి మధ్య వాగ్వివాదానికి కారణమైంది. రెస్టారెంట్ యజమాని కుమారుడు సుబెట్ సిల్వేరా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఘర్షణ జరిగింది. రెస్టారెంట్ సిబ్బంది కొందరు రవితేజ తలపై కర్రలతో దాడి చేశారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో రవితేజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఏపీ ప్రభుత్వ జోక్యంతో ప్రత్యేక విమానంలో నిన్న రవితేజ మృతదేహాన్ని తాడేపల్లిగూడెం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గోవా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.