ఫేస్బుక్ ప్రేమ.. యువతి కోసం పాక్‌కు భారత యువకుడు.. ట్విస్ట్ ఇచ్చిన ప్రేయసి!
- ఫేస్బుక్లో పరిచయమైన పాక్ యువతితో భారత యువకుడి ప్రేమ
- ఆమెను పెళ్లి చేసుకునేందుకు అక్రమంగా పాకిస్థాన్‌లోకి
- అతడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ట్విస్ట్ ఇచ్చిన యువతి
- భారత యువకుడిని అరెస్ట్ చేసిన పాకిస్థాన్ స్థానిక పోలీసులు
ప్రేమించిన యువతి కోసం ఓ భారత యువకుడు పాకిస్థాన్‌కు వెళ్లగా అక్కడి అధికారులు అతనిని అరెస్ట్ చేశారు. తాను వివాహం చేసుకోవాలనుకున్న ఫేస్బుక్ స్నేహితురాలిని కలవడానికి అక్రమంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించాడు. కానీ, అతడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఆ యువతి స్థానిక పోలీసులకు చెప్పి ట్విస్ట్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాకు చెందిన బాదల్ బాబు (30)ను గత వారం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మండి బహౌద్దీన్ జిల్లాలో (లాహోర్‌కు 240 కిలోమీటర్ల దూరం) అక్రమంగా సరిహద్దు దాటినందుకు స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో తాను తన ఫేస్బుక్ స్నేహితురాలిని పెళ్లి చేసుకోవడానికి వచ్చినట్లు పోలీసులతో చెప్పాడు.
దాంతో ఫేస్బుక్ స్నేహితురాలు సనా రాణి (21)ని పోలీసులు పిలిచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె బాదల్ ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పింది. "బాదల్, తాను గత రెండున్నరేళ్లుగా ఫేస్బుక్లో స్నేహితులమని, అయితే అతడిని పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి లేదని సనా రాణి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పింది" అని పంజాబ్ పోలీసు అధికారి నసీర్ షా చెప్పారు. ఈ మేరకు గురువారం పీటీఐ తన కథనంలో పేర్కొంది.
బాదల్ బాబు అక్రమంగా సరిహద్దు దాటి మండి బహౌద్దీన్లోని మాంగ్ గ్రామానికి సనా రాణిని కలవడానికి చేరుకోగా, అక్కడ చట్టాన్ని అమలు చేసే అధికారులు అరెస్టు చేశారని పోలీసు అధికారి పేర్కొన్నారు. ఇక రాణిని బాదల్ కలిశాడా అని అడిగినప్పుడు, ఈ విషయాన్ని తాను ధ్రువీకరించలేనని నసీర్ షా చెప్పారు.
రాణి తన కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు బాదల్ తో పెళ్లికి నిరాకరిస్తూ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే, బాదల్ తో ఉన్న సంబంధాలపై రాణితో పాటు ఆమె కుటుంబ సభ్యులను ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం ఉందని పీటీఐ పేర్కొంది.
ఇక అరెస్ట్ అయిన తర్వాత బాదల్ బాబు తన ప్రేమ కథను పోలీసులకు వివరించాడు. ఎలాంటి చట్టపరమైన పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్నందున బాబును పాకిస్థాన్ విదేశీ చట్టం సెక్షన్లు 13, 14 కింద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని కోర్టు ముందు హాజరుపరచగా 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసింది.