'పుష్ప‌2' నుంచి 'గంగో రేణుక త‌ల్లి' జాత‌ర సాంగ్ ఫుల్ వీడియో విడుద‌ల‌

      
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'పుష్ప‌2: ది రూల్' బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామీ సృష్టిస్తోంది. నాలుగు వారాలు పూర్త‌యినా, ఇప్ప‌టికీ భారీ క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతూ దూసుకెళ్తోంది. ఇక తాజాగా 'పుష్ప‌2'లో 'గంగో రేణుక త‌ల్లి' అంటూ సాగే జాత‌ర సాంగ్ ఫుల్ వీడియోను చిత్ర బృందం విడుద‌ల చేసింది.  

రేణుక‌మ్మ జాత‌ర‌లో అమ్మ‌వారి అలంక‌ర‌ణ‌లో అల్లు అర్జున్ చీర‌, కాళ్ల‌కు గ‌జ్జ‌లు, చేతికి గాజులు, న‌గ‌లు, చెవుల‌కు క‌మ్మ‌లు పెట్టుకుని చేసిన నృత్యం థియేట‌ర్‌లో పూన‌కాలు తెప్పించింది. సినిమాకే స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. ఇంకెందుకు ఆల‌స్యం.. సినిమాకే హైలైట్‌గా నిలిచిన జాత‌ర సాంగ్‌ను మీరూ చూసేయండి. 



More Telugu News