ప్రభుత్వ ఆసుపత్రులకు రోజుకు 5 బ్రెయిన్ డెడ్ కేసులు వస్తున్నాయి: మంత్రి సత్యకుమార్

  • గుంటూరు మెడికల్ కాలేజీలో అవయవదానంపై అవగాహన కార్యక్రమం
  • అవయవదానం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలన్న సత్యకుమార్
  • పేదలను మభ్యపెట్టి అవయవాలు తీసుకునే ఆసుపత్రులపై చర్యలు తప్పవని వార్నింగ్
అవయవదానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. అవయవదానంపై గుంటూరు మెడికల్ కాలేజీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవదానంపై ప్రజల్లో అవగాహన తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. 

ప్రభుత్వ ఆసుపత్రులకు రోజుకు ఐదు బ్రెయిన్ డెడ్ కేసులు వస్తున్నాయని తెలిపారు. పేదలను మభ్యపెట్టి అవయవాలు తీసుకునే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవయవాలపై వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.


More Telugu News