కెనడాలో కీలక పరిణామం... ప్రధాని పదవికి రాజీనామా చేస్తానంటూ ట్రూడో ప్రకటన

  • సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత
  • ట్రూడోపై పెరిగిన ఒత్తిడి
  • కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోగానే రాజీనామా చేస్తానని వెల్లడి 
  • అప్పటివరకు పదవిలో కొనసాగుతానన్న ట్రూడో 
గత కొన్నాళ్లుగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని నేడు ప్రకటించారు. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకునేంత వరకు పదవిలో కొనసాగుతానని తెలిపారు. ఆ తర్వాత రాజీనామా చేస్తానని వివరించారు. నూతన ప్రధానిని ఎన్నుకునేందుకు వీలుగా మార్చి 24 వరకు పార్లమెంటును పొడిగిస్తున్నానని ట్రూడో వెల్లడించారు. 

కెనడాలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ట్రూడోకు ఇటీవల కాలంలో సొంత పార్టీలోనే సెగ మొదలైంది. ఆయన తప్పుకోవాలంటూ సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. 

కాగా, తాను ప్రధాని పదవికి రాజీనామా చేయనున్న విషయాన్ని పార్టీకి, గవర్నర్ కు తెలియజేశానని ట్రూడో ఓ ప్రకటనలో వెల్లడించారు.


More Telugu News