నాగచైతన్య 'తండేల్‌' సంక్రాంతిని ఎందుకు మిస్‌ చేసుకుంది?

  • సంక్రాంతి సీజన్‌ను మిస్‌ చేసుకున్న 'తండేల్‌' 
  • రామ్‌చరణ్‌ సినిమా కోసం వాయిదా? 
  • ఫిబ్రవరి 7న రిలీజ్‌ కానున్న తండేల్‌
సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. సంక్రాంతి సీజన్‌లో వచ్చే వసూళ్లు.. ఆ సమయంలో బాక్సాఫీస్‌ వద్ద కనిపించే కళకళ మరే సీజన్‌లో కూడా కనిపించదు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు థియేటర్స్‌లో సందడి చేస్తుంటాయి. ఈ పండగ సమయంలో విడుదలైన సినిమాలో ఏ మాత్రం కథాబలం ఉండి, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయగలిగితే ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. 

ఈ సీజన్‌కు ఉన్న గొప్ప అడ్వాంటేజ్‌ కూడా ఇదే. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌', నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్‌', వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రేక్షకుల ముందుకొచ్చాయి. గేమ్‌ ఛేంజర్‌కు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా వసూళ్ల విషయంలో పర్వాలేదనిపించుకుంటోంది. 'డాకు మహారాజ్‌', సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలు.. ఈ ఇద్దరి హీరోల కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధిస్తున్న చిత్రాలుగా దూసుకపోతున్నాయి. అయితే మొదట్లో సంక్రాంతి రేసులో ఉండాలనుకున్న విశ్వంభర, తండేల్‌ చిత్రాలు వెనక్కి తగ్గాయి. 'విశ్వంభర'  వర్క్‌ పెండింగ్‌ ఉండటంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. 

అయితే ఈ సంక్రాంతికి మరో పెద్ద సినిమా వచ్చినా కూడా ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే మొదట్లో సంక్రాంతి రేసులో విడుదల చేద్దామనుకున్న నాగచైతన్య 'తండేల్‌' కూడా ఈ సంక్రాంతికి వచ్చి ఉంటే బాగుండేదని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. ఓ సినిమా ఫంక్షన్‌లో పాల్గొన్న 'తండేల్‌' చిత్ర దర్శకుడు చందు మొండేటి కూడా సంక్రాంతికి మేము అన్ని విధాల రెడీగా ఉంటామని కూడా అప్పట్లో అనౌన్స్‌ చేశాడు. 

అయితే రామ్‌చరణ్‌ 'గేమ్‌ఛేంజర్‌' సంక్రాంతి బరిలో ఉండటంతో, గీతా ఆర్ట్స్‌ సంస్థపై అల్లు అరవింద్‌ సమర్పణలో తన నిర్మాణంలో జరుపుకుంటోన్న 'తండేల్‌' చిత్రం విషయంలో బన్నీ వాస్‌ వెనక్కి తగ్గాడు. అయితే ఫిబ్రవరి 7న రిలీజ్‌ కానున్న 'తండేల్‌' సంక్రాంతి సీజన్‌ను మిస్‌ చేసుకుందని, డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమాకు సంక్రాంతి సీజన్‌ కచ్చితంగా ప్లస్‌ అయ్యేదని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 


More Telugu News