వాకింగ్ ఎన్ని రకాలో... ఎలా నడిస్తే ఆరోగ్యానికి లాభమో తెలుసా?
- నడక మన శరీరానికి మంచి వ్యాయామం
- వాకింగ్ లోనూ పలు రకాలు ఉన్నాయని చెబుతున్న నిపుణులు
- ఒక్కో రకంతో ఒక్కో రకమైన ప్రయోజనాలు ఉంటాయని వెల్లడి
- అయితే ఏ రకం వాకింగ్ అయినా ఆరోగ్యానికి మంచిదేనని స్పష్టీకరణ
మారిన ఆహార అలవాట్లు, పెద్దగా శ్రమలేని జీవన శైలితో రకరకాల వ్యాధులు ముసురుకుంటున్నాయి. పెద్దగా వ్యాయామం చేసే పరిస్థితి కూడా లేనంతగా జీవితం బిజీ బిజీగా మారిపోయింది. ఇలాంటి సమయంలో కనీసం వాకింగ్ చేయడం వల్ల అయినా మంచి ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే ఈ వాకింగ్ లోనూ కొన్ని రకాలు ఉన్నాయని... వాటి వల్ల విభిన్నమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
బ్రిస్క్ వాకింగ్...
అడుగులో అడుగేసినట్టు కాకుండా కాస్త వేగంగా నడవడం, అదే సమయంలో చేతులను కూడా తగిన స్థాయిలో ఊపుతూ నడవడాన్ని బ్రిస్క్ వాకింగ్ అంటారు. సుమారు గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో నడుస్తారు. దీనితో మరీ తీవ్రమైన అలసట లేకుండా, శ్వాస తీసుకోవడానికి కష్టపడాల్సినంత అవసరం రాకుండానే... గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
ఇంటర్వెల్ వాకింగ్...
ఇది సాధారణ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ ల సమ్మిళితమైన విధానం. అంటే రెండు మూడు నిమిషాలు వేగంగా నడవడం, తర్వాత మరో రెండు మూడు నిమిషాలు మెల్లగా నడవడం, తిరిగి వేగంగా నడవడం... ఇలా మార్చుతూ వాకింగ్ చేసే పద్ధతే ఇంటర్వెల్ వాకింగ్.
మైండ్ ఫుల్ వాకింగ్...
మెల్లగా నడుస్తూ, దీర్ఘంగా శ్వాస పీలుస్తూ, వదులుతూ చేసే వాకింగ్ ఇది. ఎలాంటి రణగొణ ధ్వనులు, డిస్ట్రబెన్స్ లేని ప్రదేశాల్లో ఈ వాకింగ్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
హైకింగ్...
చిన్నపాటి కొండలు, ఎగుడు దిగుడుగా ఉండే ప్రదేశాల్లో చేసే వాకింగ్ ఇది. ఎత్తుపల్లాల్లో నడిచేప్పుడు స్థిరమైన వేగంతో ఉండాలని, తగిన షూ ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
నార్డిక్ వాకింగ్...
కేవలం కాళ్లకు మాత్రమేకాకుండా రెండు చేతులు, భుజాలకూ వ్యాయామం అందే తరహా వాకింగ్ ఇది. రెండు చేతుల్లో రెండు పొడవాటి కర్రలను పట్టుకుని వాటిని మనం వాకింగ్ చేసేప్పుడు నేలకు ఆనిస్తూ, వాటిపై కాస్త బరువు వేసి ముందుకు కదులుతూ ఉంటారు.

- గుండె సంబంధిత ఆరోగ్యం మెరుగుపడటానికి, శరీరంలో కేలరీలు కరగడానికి, నడుము నుంచి దిగువ భాగంలో కండరాలు గట్టిపడటానికి బ్రిస్క్ వాకింగ్ తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్వెల్ వాకింగ్...
ఇది సాధారణ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ ల సమ్మిళితమైన విధానం. అంటే రెండు మూడు నిమిషాలు వేగంగా నడవడం, తర్వాత మరో రెండు మూడు నిమిషాలు మెల్లగా నడవడం, తిరిగి వేగంగా నడవడం... ఇలా మార్చుతూ వాకింగ్ చేసే పద్ధతే ఇంటర్వెల్ వాకింగ్.
- శరీరంలో శక్తిని పెంపొందించడానికి, జీవక్రియలు వేగం పుంజుకోవడానికి ఈ వాకింగ్ తోడ్పడుతుంది. అంతేకాదు.. సాధారణ వాకింగ్ కంటే ఎక్కువ కేలరీలు కరగడానికి వీలు కల్పిస్తుంది.
మైండ్ ఫుల్ వాకింగ్...
మెల్లగా నడుస్తూ, దీర్ఘంగా శ్వాస పీలుస్తూ, వదులుతూ చేసే వాకింగ్ ఇది. ఎలాంటి రణగొణ ధ్వనులు, డిస్ట్రబెన్స్ లేని ప్రదేశాల్లో ఈ వాకింగ్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
- మైండ్ ఫుల్ వాకింగ్ వల్ల మెడిటేషన్ చేసిన స్థాయిలో ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు. శరీరంలో ఒత్తిడి తగ్గి విశ్రాంతిని ఇస్తుందని, మానసిక ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుందని స్పష్టం చేస్తున్నారు.
హైకింగ్...
చిన్నపాటి కొండలు, ఎగుడు దిగుడుగా ఉండే ప్రదేశాల్లో చేసే వాకింగ్ ఇది. ఎత్తుపల్లాల్లో నడిచేప్పుడు స్థిరమైన వేగంతో ఉండాలని, తగిన షూ ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
- హైకింగ్ వల్ల నడుము దిగువ భాగంలో కండరాలు బలోపేతం అవుతాయని, శరీరంలో సమతుల్యత పెరుగుతుందని వివరిస్తున్నారు. ప్రకృతితో నడవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని చెబుతున్నారు.
నార్డిక్ వాకింగ్...
కేవలం కాళ్లకు మాత్రమేకాకుండా రెండు చేతులు, భుజాలకూ వ్యాయామం అందే తరహా వాకింగ్ ఇది. రెండు చేతుల్లో రెండు పొడవాటి కర్రలను పట్టుకుని వాటిని మనం వాకింగ్ చేసేప్పుడు నేలకు ఆనిస్తూ, వాటిపై కాస్త బరువు వేసి ముందుకు కదులుతూ ఉంటారు.
- శరీరంలో ముఖ్యమైన కండరాలన్నీ దీనితో బలోపేతం అవుతాయని, ఎక్కువ కేలరీలు కరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని వివరిస్తున్నారు.