ఆఫ్ఘ‌నిస్థాన్ చేతిలో ఓట‌మి.. ఏడ్చేసిన జో రూట్‌.. ఇదిగో వీడియో!

  • ఆఫ్ఘ‌నిస్థాన్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఊహించ‌ని షాక్ 
  • త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఓట‌మి.. టోర్నీ నుంచి నిష్క్ర‌మ‌ణ‌
  • జో రూట్ శ‌తకం (120) చేసినా ఫ‌లితం లేకుండా పోయిన వైనం
  • దాంతో ప‌రాజ‌యం త‌ర్వాత క‌న్నీళ్లు పెట్టుకున్న జో రూట్‌
ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా నిన్న‌ ఆఫ్ఘ‌నిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆఫ్ఘ‌నిస్థాన్ చేతిలో బ‌ల‌మైన ఇంగ్లీష్ జ‌ట్టు పరాజ‌యం పాలైంది. ఎనిమిది ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్‌ జ‌ట్టును ఓడించింది. ఆఖ‌రి వ‌ర‌కు ఇంగ్లండ్ గెలుపు ఖాయ‌మ‌నే అంద‌రూ అనుకున్నారు. 

కానీ, చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో ఆఫ్ఘాన్‌ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్‌ను క‌ట్ట‌డి చేయ‌డంతో మ్యాచ్ మ‌లుపు తిరిగింది. ఇంకా చెప్పాలంటే ఆఫ్ఘనిస్థాన్ బౌల‌ర్లు మ్యాజిక్ చేసి, మ్యాచ్ స్వరూపమే మార్చేశారు. దాంతో టోర్నీలో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో జాస్ బ‌ట్ల‌ర్ సేన ఓట‌మి చ‌విచూసింది.  

ఈ ప‌రాజ‌యంతో ఇంగ్లండ్ ఇంటిముఖం ప‌ట్టింది. 326 పరుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఆ జ‌ట్టు 317 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో జో రూట్ శ‌తకం (120) చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. చాలా ఓపిక‌గా బ్యాటింగ్ చేసిన రూట్‌.. చివ‌రి వ‌ర‌కు జ‌ట్టును గెలిపించేందుకు ప్ర‌య‌త్నించాడు. 

కానీ, అత‌ను ఔటైన త‌ర్వాత మ్యాచ్ చేజారింది. దాంతో మ్యాచ్ ఓడిపోయిన త‌ర్వాత స్టార్ బ్యాట‌ర్ క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 


More Telugu News