కెవిన్ పీట‌ర్స‌న్‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కీల‌క బాధ్య‌త‌లు

  • ఢిల్లీ క్యాపిట‌ల్స్ మెంటార్‌గా పీట‌ర్స‌న్‌
  • సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించిన డీసీ
  • ఢిల్లీ హెడ్ కోచ్ హేమాంగ్‌ బ‌దానీతో క‌లిసి ప‌నిచేయ‌నున్న మాజీ ఆట‌గాడు
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీట‌ర్స‌న్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది. రాబోయే సీజ‌న్‌కు త‌మ జ‌ట్టు మెంటార్‌గా నియ‌మించింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. కాగా, పీట‌ర్స‌న్ 2012 నుంచి 2014 వ‌ర‌కు ఢిల్లీకి ప్రాతినిధ్యం వ‌హించిన విష‌యం తెలిసిందే. 

2014 సీజ‌న్‌లో డీసీకి కెప్టెన్‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. ఇప్పుడు దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అదే జ‌ట్టుకు మెంటార్ రూపంలో సేవ‌లు అందించ‌నున్నాడు. పీటర్సన్ ఢిల్లీ హెడ్ కోచ్ హేమాంగ్‌ బ‌దానీ, క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల్ రావు, అసిస్టెంట్ కోచ్ మాథ్యూ మాట్, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్‌లతో కలిసి పనిచేయ‌నున్నాడు. 


More Telugu News