చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. తొలి సార‌థిగా న‌యా రికార్డు!

  • నాలుగు ఐసీసీ టోర్నమెంట్లలోనూ జ‌ట్టును ఫైనల్స్‌కు చేర్చిన‌ తొలి కెప్టెన్‌గా రోహిత్‌ రికార్డు
  • 2023 డ‌బ్ల్యూటీసీ, 2023 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2024 టీ20 ప్రపంచ‌క‌ప్‌, ఈ ఏడాది ఛాంపియ‌న్స్ ట్రోఫీ
  • 2007, 2011, 2013లో వరుసగా మూడు ఐసీసీ ఈవెంట్లలో భారత్‌కు టైటిల్స్ అందించిన ధోనీ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలో నాలుగు ఐసీసీ టోర్నమెంట్లలోనూ జ‌ట్టును ఫైనల్స్‌కు చేర్చిన‌ తొలి కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రికార్డుకెక్కాడు. 2023 వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్‌, 2023 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2024 టీ20 ప్రపంచ‌క‌ప్‌, ఈ ఏడాది ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్‌ను ఫైన‌ల్‌కు చేర్చాడు. వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్‌, వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోగా... టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో మాత్రం ద‌క్షిణాఫ్రికాపై టీమిండియా గెలిచింది. ఇప్పుడు ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లోనూ విజ‌యం సాధించాల‌ని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. 

ఇక భారత మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ 2007, 2011, 2013లో వరుసగా మూడు ఐసీసీ ఈవెంట్లలో టీ20 ప్రపంచ కప్, వన్డే వ‌ర‌ల్డ్‌ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలలో భారత్‌కు టైటిల్స్ అందించాడు. కానీ, ధోనీ టెస్ట్‌ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యే వరకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం కాలేదు. దాంతో ఎంఎస్‌డీకి ఈ ఫీట్ సాధించే అవ‌కాశం లేకుండా పోయింది. అయితే, ధోనీ ఆచరణాత్మకంగా చేయలేని దానిని రోహిత్ ఇప్పుడు పూర్తి చేశాడు. కాగా, భారత్‌ను వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ ఫైనల్‌కు తీసుకెళ్లిన మొదటి కెప్టెన్ మాత్రం విరాట్ కోహ్లీ అయ్యాడు. 


More Telugu News