రెండో సెమీస్‌లో ర‌చిన్ ర‌వీంద్ర‌ సెంచ‌రీ.. భారీ స్కోర్ దిశ‌గా కివీస్‌!

  • లాహోర్‌లో ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మ‌ధ్య రెండో సెమీస్‌
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌
  • సెంచ‌రీ (108)తో క‌దంతొక్కిన ర‌చిన్ ర‌వీంద్ర‌
  • విలియ‌మ్స‌న్‌తో క‌లిసి 164 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యం
ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య‌ జ‌రుగుతున్న రెండో సెమీస్‌లో కివీస్ బ్యాట‌ర్ ర‌చిన్ రవీంద్ర సెంచ‌రీతో క‌దంతొక్కాడు. 93 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స‌ర్ సాయంతో శ‌త‌కం న‌మోదు చేశాడు. మొత్తంగా 101 బంతుల్లో 108 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో మొద‌ట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కు తొలి వికెట్ కు 48 ప‌రుగుల శుభారంభం ల‌భించింది. 21 ప‌రుగులు చేసి ఓపెన‌ర్ విల్ యంగ్ పెవిలియ‌న్ చేరాడు. ఆ త‌ర్వాత ర‌చిన్ ర‌వీంద్ర‌తో జ‌తక‌ట్టిన కేన్ విలియ‌మ్స‌న్ మ‌రో వికెట్ ప‌డ‌కుండా ఆచితూచి ఆడాడు. ఈ ద్వ‌యం రెండో వికెట్‌కు ఏకంగా 164 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్ప‌డం విశేషం. ప్ర‌స్తుతం క్రీజులో విలియ‌మ్స‌న్ (82 నాటౌట్‌), మిచెల్ (10 నాటౌట్‌) ఉండ‌గా... కివీస్ స్కోరు:  224/2 (36 ఓవ‌ర్లు). ఇంకా 14 ఓవ‌ర్ల ఆట మిగిలి ఉన్నందున‌ భారీ స్కోర్ న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది. 


More Telugu News