సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్లు.. వీడియో ఇదిగో!

      
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భూమికి చేరుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌, బుచ్ విల్మోర్‌కు డాల్ఫిన్లు స్వాగతం పలికాయి. సునీత, విల్మోర్‌, మరో ఇద్దరు వ్యోమగాములు నిక్ హాగ్, రోస్‌కోమోస్ కాస్మోనాట్ అలెక్సాండర్ గోర్బనోవ్‌తో కూడిన క్రూ డ్రాగన్ క్యాప్సుల్ ఈ తెల్లవారుజామున ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయింది. ఆ వెంటనే వారికి స్వాగతం పలుకుతున్నట్టుగా క్యాప్సుల్ చుట్టూ డాల్ఫిన్లు ఈదడం కనిపించింది.

సముద్రంలో ల్యాండైన క్యాప్సుల్‌ను బోట్‌లోకి ఎక్కించేందుకు నాసా సిబ్బంది ప్రయత్నిస్తున్న సమయంలో డాల్ఫిన్లు దాని చుట్టూ చేరాయి. కాగా, క్యాప్సుల్ నుంచి వ్యోమగాములను బయటకు తీసిన సిబ్బంది అనంతరం వారిని హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వారిని 45 రోజులపాటు పునరావాసంలో ఉంచుతారు.  


More Telugu News