కుటుంబ గొడవలపై మంచు విష్ణు భార్య విరానిక కీలక వ్యాఖ్యలు

  • కుటుంబం అన్నాక గొడవలు సహజమేనన్న విరానిక
  • గొడవల వల్ల పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారని ఆవేదన
  • తాతయ్యకు ఏమైనా అవుతుందా అని పిల్లలు ఆందోళన చెందుతున్నారని వెల్లడి
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంటి గొడవ రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఈ గొడవపై మంచు విష్ణు భార్య విరానిక కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రచ్చ వల్ల తన పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఆమె చెప్పారు. కుటుంబం అన్నాక గొడవలు సహజమేనని... అయితే చాలా వరకు బయటకు రావని... దురదృష్టవశాత్తు తమ కుటుంబంలోని గొడవలు బయటకు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

తనకు తన పిల్లలు ముఖ్యమని, కుటుంబ గొడవల వల్ల తనకంటే తన పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారని తెలిపారు. తాతయ్యకు ఏమైనా జరుగుతుందా అని వాళ్లు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. తాను ధైర్యంగా ఉంటేనే పిల్లలకు ఎంతోకొంత ధైర్యం చెప్పగలనని అన్నారు. తాను నాలుగోసారి గర్భం దాల్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారని... తనకు, విష్ణుకు పిల్లలు ఇష్టమని అందుకే నలుగురిని కన్నామని చెప్పారు.


More Telugu News