రామ్ చ‌ర‌ణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు క‌ళ్లు చెదిరే ధ‌ర‌..!

  • రామ్ చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు సానా కాంబోలో 'పెద్ది'
  • మూవీ ఆడియో రైట్స్‌ను రూ. 35 కోట్ల‌కు ద‌క్కించుకున్న టీ-సిరీస్ 
  • 'పెద్ది'కి ఆస్కార్ అవార్డు విన్న‌ర్‌ ఏఆర్ రెహ‌మాన్ బాణీలు
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం 'పెద్ది'. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ల‌తో మూవీపై మంచి అంచ‌నాలు నెల‌కొన‌గా చిత్ర‌బృందం తాజాగా మ‌రో క్రేజీ న్యూస్ చెప్పింది. ఆస్కార్ అవార్డు విన్న‌ర్‌ ఏఆర్ రెహ‌మాన్ అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్‌కు క‌ళ్లు చెదిరే ధ‌ర ద‌క్కింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ రూ. 35కోట్ల‌కు ద‌క్కించుకుంద‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. కాగా, రెహ‌మాన్‌-చర‌ణ్ కాంబినేష‌న్‌లో ఇదే తొలి మూవీ కావ‌డం విశేషం. 

ఇక చెర్రీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మార్చి 27న మూవీ టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన చిత్రం యూనిట్ ఇప్పుడు ఏప్రిల్ 6న శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఉగాది పండుగ నాడు ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో ఏప్రిల్ 6 కోసం మెగా ఫ్యాన్స్ ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. 

ఈ చిత్రంలో చెర్రీ స‌ర‌స‌న హీరోయిన్‌గా బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ న‌టిస్తుండ‌గా... శివ‌రాజ్ కుమార్, బాలీవుడ్ న‌టుడు దివ్యేందు, జ‌గ‌ప‌తి బాబు త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.   


More Telugu News